prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 2:20 pm Digital Edition : PRAJA KSHETRAM

జన్మదిన సందర్భంగా ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు

జన్మదిన సందర్భంగా ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్న కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు

సదాశివపేట, ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):సదాశివపేట మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు తన జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సదాశివపేట పట్టణం మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. ఇట్టి సందర్భంగా పులిమామిడి మమత మాట్లాడుతూ ఆశాడ మాసంలో అమ్మవారి ఉత్సవాలలో భాగంగా తన పుట్టినరోజు రావడం ఎంతో సంతోషంగా ఉందని వారి అభిప్రాయాన్ని తెలియపరిచారు. వర్షాలు సకాలంలో పడి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వన దుర్గ మాతను కొరుకున్నానని తెలియపరిచారు.
ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కుటుంబ సభ్యులు అంజలి నాగరాజ్, సాయి, మధు, పద్మ, అఖిల్, సోమశంకర్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా పులిమామిడి మమతకు 12వ వార్డు ప్రజలు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె ప్రజాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.