డాక్టర్ పేరుతో దందా..సూరారంలో బోగస్ క్లినిక్ బట్టబయలు
డాక్టర్ పేరుతో దందా..సూరారంలో బోగస్ క్లినిక్ బట్టబయలు కుత్బుల్లాపూర్ ఎస్‌వోటీ–సూరారం పోలీసుల సంయుక్త దాడి మెడికల్ అర్హతలు లేకుండానే ఏడాదిగా వైద్యం నిందితుడిపై కేసు నమోదు..దర్యాప్తు ముమ్మరం కుత్బుల్లాపూర్, ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):వైద్య సేవల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న బోగస్ క్లినిక్‌పై సూరారం పోలీసులు, కుత్బుల్లాపూర్ ఎస్‌వోటీ బృందం సంయుక్తంగా దాడి చేసి నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 31న విశ్వసనీయ సమాచారం మేరకు వెంకటరామ నగర్‌లోని బచ్‌పన్ స్కూల్ సమీపంలో నిర్వహిస్తున్న "రక్షిత క్లినిక్"లో...