డీసీఎం ఢీకొని దంపతుల దుర్మరణం

డీసీఎం ఢీకొని దంపతుల దుర్మరణం జహీరాబాద్ ఆగస్టు 27(ప్రజాక్షేత్రం):పరిధిలోని బడంపేట్ శివారులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా, అజాగ్రత్తగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఆటోను ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. బడంపేట్కు చెందిన బేగరి రామయ్య (48), పద్మమ్మ (40) బతుకుదెరువు కోసం జహీరాబాద్లో నివాసముంటున్నారు. గురువారం ఉదయం సుమారు 9.30 గంటలకు ఆటోలో జహీరాబాద్ నుంచి బడంపేట్కు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం (AP15 Y 0725) ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జుకాగా, రామయ్య, పద్మమ్మ...