prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 9:54 am Digital Edition : PRAJA KSHETRAM

తుంగతుర్తి టికెట్ సోమన్నకేనా.?

తుంగతుర్తి టికెట్ సోమన్నకేనా.?

  • ఏమవుతుందో అనుకుంటున్న ఏపూరి సోమన్న రాజకీయ భవిష్యత్ గొప్ప టర్న్ తీసుకోనుందా ?

హైదరాబాద్ ఆగస్టు 01(ప్రజాక్షేత్రం):మందుల సామ్యూల్ vs కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య చెలరేగిన వివాదాల నేపథ్యంలో సోమన్న రాజగోపాల్ రెడ్డి గారిని కలవడం కొత్త చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల్లో సామ్యూల్ స్థానంలో సోమన్నను నిలబెట్టే అవకాశాలు లేకపోలేదు. సోమన్న తుంగతుర్తి స్థానిక మాదిగ బిడ్డ, ఉద్యమ నేపథ్యం, సామాజిక చైతన్యం, గాయకునిగా రెండు తెలుగు రాష్ట్రాలకి సుపరిచితుడు, కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికలకు సోమన్న ప్రచార గీతాలను అందించారు. సోమన్న కూడా గతంలో నా రాజకీయ భవిష్యత్ రాజగోపాల్ రెడ్డి నిర్ణయాలతో ముడిపడి ఉంది అని చేసిన ప్రకటన కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది సోమన్నకు కూడా పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలని, తుంగతుర్తి నుండి చట్ట సభల్లో అడుగుపెట్టాలని కోరిక వుండడం, జరుగుతున్న పొలిటికల్ వార్ సంధర్భంగా సోమన్న రాజగోపాల్ రెడ్డి ని కలవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారులు వేసినట్టయింది.