తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
వలిగొండ ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో ఆరూరు గ్రామానికి చెందిన రవ్వ సత్యం, అనారోగ్యంతో ఇటీవల మరణించడం జరిగింది వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి తుమ్మల నరసయ్య సేవాసమితి ఆధ్వర్యంలో 10,000 /- ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట చైర్మన్ తుమ్మల శ్రీనివాస్, తుమ్మల సంతోష్ కుమార్, తుమ్మల నరసయ్య సేవా సమితి కార్యదర్శి వెర్మినేటి సంతోష్, సేవా సమితి ఉపాధ్యక్షులు సుంకి ఆనంద్ , మాజీ మత్స్యగిరి గుట్ట ధర్మకర్త బండి రవికుమార్, కాంగ్రెస్ నాయకులు కాలేరు చందర్, జినకల మల్లయ్య, లోతుకుంట రాములు, జినుకల స్వామి, వెంకటేశం, వెలిమినేటి వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.