prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 5:07 pm Digital Edition : PRAJA KSHETRAM

తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డిది కీలక పాత్ర

తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డిది కీలక పాత్ర

  • బీఆర్ఎస్ నాయకులు తేల్ల రవికుమార్
  • కోటగిరిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల ఘన నివాళులు

కోటగిరి, ఆగస్ట్ 01(ప్రజాక్షేత్రం):తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చాలా కీలకమైనదని బీఆర్ఎస్ నాయకులు తేల్ల రవికుమార్ పేర్కొన్నారు. శనివారం కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కోటగిరి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు నివాళులు అర్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలు సమర్పించి అయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు తేల్ల రవికుమార్ మాట్లాడుతూ….ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. కెసిఆర్ కు అత్యంత సన్నిహితుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. వరంగల్ గడ్డమీద అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, ఒడిదుడుకులను అధిగమించి ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో ఒక మైలురాయిగా నిలిచారని చెప్పారు .ఆర్థిక బలం లేకున్నా ఆత్మీయ బలంతో ప్రజాక్షేత్రంలో ఉద్యమ జెండాను భుజాన ఎత్తుకుని ప్రత్యేక రాష్ట్ర సాధనకై పాటుపడి నర్సంపేట ప్రజలకు ఎమ్మెల్యేగా నిస్వార్ధ సేవలు అందించారని ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఎలాంటి ఆస్తులు కూడబెట్టుకోకుండా పేద ప్రజలకు సేవ చేయడంలోనే జీవితం అర్పించారని అన్నారు. ఆయన చేసిన సేవలకు గాను నర్సంపేట మట్టిలో ఆయన ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్, కప్ప సంతోష్, శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, గంగా ప్రసాద్ గౌడ్, మండల మేరు సంఘం అధ్యక్షుడు సందీప్, జలాల్, తదితరులు పాల్గొన్నారు.