prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 6:05 am Digital Edition : PRAJA KSHETRAM

పెద్దేముల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పెద్దేముల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పెద్దేముల్, ఆగస్టు 15 (ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.అనంతరం అధికారులు, సిబ్బంది, ప్రజలు జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.ఈ సందర్భంగా మండల తహసీల్దార్ బి.వెంకటేష్ ప్రసాద్ మాట్లాడుతూ….స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు.దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువత దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించాలని, విద్య, సాంకేతికత, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.