పేదల బియ్యం కర్ణాటకకు.. కొడంగల్‌ కేంద్రంగా పక్కదారి?

పేదల బియ్యం కర్ణాటకకు.. కొడంగల్‌ కేంద్రంగా పక్కదారి? నెలకు వేల టన్నుల బియ్యం..దళారుల చేతుల్లోకి ఎంత? లబ్ధిదారుల నుంచి కొనుగోళ్లు.. సరిహద్దులు దాటి కర్ణాటక మార్కెట్లకు తరలింపు ఆరోపణలు వికారాబాద్‌, ఆగస్టు 27(ప్రజాక్షేత్రం):పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వికారాబాద్‌ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా కొడంగల్‌ నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని గ్రామీణ ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యాన్ని సేకరించి కర్ణాటక వైపు తరలిస్తున్నారన్న సమాచారం తాజాగా చర్చనీయాంశంగా మారింది. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు...