పొలాన్ని చదివిన కమ్యూనిస్టుకామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి
పొలాన్ని చదివిన కమ్యూనిస్టుకామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి రైతు గురించి మాట్లాడేవారు.. రైతు సమస్యలపై పోరాడేవారు అనేకమంది ఉంటారు. కానీ, రైతు జీవితాన్ని అధ్యయనం చేసి, ఆ జీవితాన్ని నిర్దేశించే సామాజిక ఆర్థిక సంబంధాలను అర్థం చేసుకుని, ఆ అవగాహనను నిరంతర ప్రజా ఉద్యమంగా మలిచిన నాయకులు చాలా అరుదు. కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి అలాంటి కమ్యూనిస్టు నాయకుడు. ఆయన జీవితాన్ని ఒక వ్యక్తి జీవితచరిత్రగా చూస్తే సరిపోదు. తెలంగాణ గ్రామీణ సమాజంలో కమ్యూనిస్టు ఉద్యమం ఎదిగిన తీరు, రైతాంగ పోరాటం పరిణామం, వ్యవసాయ రంగంపై...