ప్రజల మధ్యే ఎమ్మెల్యే.. బైక్‌పై కాలనీల పర్యటన

[caption id="attachment_7957" width="300"]ప్రజల మధ్యే ఎమ్మెల్యే.. బైక్‌పై కాలనీల పర్యటన[/caption] నాచారం, ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):ఆర్భాటాలకు దూరంగా, ప్రజలతో నేరుగా మమేకమవుతూ ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సోమవారం నాచారం సర్కిల్ పరిధిలోని బాబానగర్, ఇంద్రనగర్ కాలనీల్లో కార్యకర్తలతో కలిసి బైక్‌పై పర్యటించారు. కాలనీల్లోని వీధులు, అంతర్గత రహదారులను పరిశీలిస్తూ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు కనిపించే హడావుడి, భద్రతా...