ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి:మంద కృష్ణ మాదిగ
ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి రెండెకరాల భూమి కేటాయించాలి: మంద కృష్ణ మాదిగ చిలకలూరిపేట, ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):చిలకలూరిపేట పట్టణంలోని అడ్డరోడ్డు కూడలి వద్ద ప్రైవేటు బస్సు–ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు దళిత కూలీలు మృతి చెందిన ఘటనపై ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం వేలూరు గ్రామానికి వెళ్లి మృతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల్లో ఆరుగురు మాదిగ మహిళలు, ఒక పురుషుడు...