ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత.
ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత. గుండెపోటుతో ముంబయిలో తుదిశ్వాస.. విలన్ పాత్రలతో ప్రేక్షకుల మన్ననలు. ముంబయి ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):తెలుగు సినీ ప్రేక్షకులకు విలక్షణ ప్రతినాయకుడిగా సుపరిచితుడైన ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ (74) మంగళవారం కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన ప్రదీప్ సింగ్ రావత్ తన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగులో 'సై', 'ఛత్రపతి', 'గజిని' చిత్రాల్లో...