prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:33 pm Digital Edition : PRAJA KSHETRAM

ఫత్తేపూర్ బ్రిడ్జిపై ప్రమాదకర గుంత.. మరమ్మతులకు ప్రజల డిమాండ్

ఫత్తేపూర్ బ్రిడ్జిపై ప్రమాదకర గుంత.. మరమ్మతులకు ప్రజల డిమాండ్

శంకర్‌పల్లి, ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఫత్తేపూర్ బ్రిడ్జిపై ప్రమాదకర గుంత ఏర్పడింది. చేవెళ్ల నుంచి శంకర్‌పల్లి వైపు వచ్చే ప్రధాన మార్గంలోని బ్రిడ్జి ప్రారంభ భాగంలో ఏర్పడిన ఈ గుంతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా బ్రిడ్జి స్లాబ్‌లోని ఇనుప రాడ్లు బయటకు కనిపిస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. వర్షాల కారణంగా గుంతలో నీరు చేరి అది స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాద ముప్పు మరింత పెరిగిందని తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చడంతో పాటు బ్రిడ్జి దెబ్బతిన్న భాగాలకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.