ఫత్తేపూర్ బ్రిడ్జిపై ప్రమాదకర గుంత.. మరమ్మతులకు ప్రజల డిమాండ్
ఫత్తేపూర్ బ్రిడ్జిపై ప్రమాదకర గుంత.. మరమ్మతులకు ప్రజల డిమాండ్ శంకర్‌పల్లి, ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో ఫత్తేపూర్ బ్రిడ్జిపై ప్రమాదకర గుంత ఏర్పడింది. చేవెళ్ల నుంచి శంకర్‌పల్లి వైపు వచ్చే ప్రధాన మార్గంలోని బ్రిడ్జి ప్రారంభ భాగంలో ఏర్పడిన ఈ గుంతతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా బ్రిడ్జి స్లాబ్‌లోని ఇనుప రాడ్లు బయటకు కనిపిస్తుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. వర్షాల కారణంగా గుంతలో...