బైపాస్ రోడ్ భాగంగా భూ సేకరణ కొరకు రైతుల అభిప్రాయం గ్రామసభ.
ఎకరానికి రూ. 50 లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలి.
- చెన్నారం, దౌలాపూర్, గ్రామాల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
- గ్రామ సభలో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత.
- సర్వేయర్ మహేష్ కుమార్ నిర్లక్ష్యం చేయడం వలనే రైతులకు అన్యాయం?
- కెవిపిఎస్, ప్రజాసంఘాలు, డిమాండ్.
యాలాల ఆగస్టు 27(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని రసూల్ పూర హనుమాన్ దేవాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన గ్రామ సభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కు, కెవిపిఎస్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప లు మాట్లాడుతూ.. దళితులు పేదల భూ సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎకరానికి రూ. 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దౌలాపూర్ రెవెన్యూ గ్రామ పరిధిలో నీ సర్వేనెంబర్ 73 లో చెన్నారం, దౌలాపూర్ , గ్రామాల దళిత, వడ్డె కులస్తుల రైతులకు 25 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం 1980 ఏడాదిలో సాగు చేసుకోవడానికి 11 మంది కుటుంబాలకు రెండు ఎకరాలు చొప్పున 25 ఎకరాలు భూ పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి భూమిలో గతం నుండి ఇప్పటివరకు కబ్జాలో ఉండి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. సీఎం జిల్లాలో అభివృద్ధిపై పేద, దళిత రైతుల భూమిని కబ్జా చేసి రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో రైతుల పొలాల నుండి పూర్తిగా ఎర్ర మట్టిని తరలించి, దళితుల భూమి సాగు చేసుకోవడానికి వీలు లేకుండా చేసి భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క భూమికి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు చేస్తూ కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పేదల భూములకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా భూములు గుంచుకోవడం సరింది కాదని అన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పేదరా భూములు తీసుకున్నప్పుడు భూమికి భూమి ఇవ్వాలి, ప్రస్తుతం ధరలు అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా అధికారులు వ్యవహరించడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దళిత, పేదల, భూమికి భూమి ఇప్పించాలని, లేకుంటే నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల సర్వేయర్ మహేష్ కుమార్ విధుల్లో నిర్లక్ష్యం చేయడం వలనే రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మహేందర్, వై. రాములు, రాజు, భూ భాధితులు మదరప్ప, చంద్రప్ప, బాలరాజు, తదితరులు రైతులు పాల్గొన్నారు.