prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 9:44 am Digital Edition : PRAJA KSHETRAM

మహిళపై లైంగిక దాడి కేసులో సబ్-ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

మహిళపై లైంగిక దాడి కేసులో సబ్-ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

హైదరాబాద్ జులై 01(ప్రజాక్షేత్రం):సోషల్ మీడియాలో మహిళలతో పరిచయం పెంచుకుని వారిని మోసం చేసిన ఆరోపణలపై పోలీసులు సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి వివాహం చేస్తానని నమ్మించి లైంగికంగా దాడి చేశాడని వచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు నిందితుడిని నిజామాబాద్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. అనంతరం తదుపరి విచారణ కోసం హనుమకొండకు తరలించారు. అరెస్టైన నిందితుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.