మహిళా సంఘాల అభ్యున్నతికి విశేష కృషి…
3 వీఓఏలకు అవార్డులు
- 7 అంశాల్లో వంద శాతం పనితీరు
- ముగ్గురు VOAలకు ఉత్తమ ప్రతిభ పురస్కారాలు
- మహిళా సంఘాల బలోపేతానికి కృషి
- బ్యాంకు రుణాలు, అజీవికలో ముందంజ
- వీఓఏల సేవలను అభినందించిన అధికారులు
- మహిళా సాధికారతే లక్ష్యంగా సెర్ప్ కార్యక్రమాలు
పెద్దేముల్, ఆగస్టు 15 (ప్రజాక్షేత్రం):గ్రామస్థాయిలో మహిళా సంఘాల కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడంలో వీఓఏల పాత్ర కీలకమని పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామి, ఎంపీఓ రతన్ సింగ్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు యాలాటి పావని లు అన్నారు.శనివారం పెద్దేముల్ మండలంలో మహిళా సంఘాలకు సెర్ప్ ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో 100% శాతం లక్ష్యాలను సాధిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు గ్రామ సంఘాల వీఓఏలకు శనివారం అవార్డులు అందజేశారు.మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల మంజూరు,చీరల పంపిణీ, ఉద్యమ రిజిస్ట్రేషన్, ఎంటర్‌ప్రైజెస్ యూనిఫామ్ స్టిచ్చింగ్, అజీవిక తదితర ఏడు అంశాల్లో 100% శాతం లక్ష్యాలను సాధించడంలో విశేష కృషి చేసిన వారిని ఉత్తమ వీఓఏలుగా ఎంపిక చేశారు.ఈ మేరకు గొట్లపల్లి గ్రామ సంఘం వీఓఏ యాస్మిన్ ఉన్నిసా, కందనెల్లి-1 గ్రామ సంఘం వీఓఏ నిర్మల, పెద్దేముల్-1 గ్రామ సంఘం వీఓఏ నాగేష్ లను ఉత్తమ వీఓఏలుగా ఎంపిక చేసి అవార్డులు అందజేశారు.మహిళా సంఘాల బలోపేతానికి, సభ్యులకు ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు మరియు జీవనోపాధి అవకాశాలు అందించడంలో వీరు చేసిన కృషిని అధికారులు అభినందించారు.ఈ సందర్భంగా పెద్దేముల్ మండల ఎంపీడీఓ కే.తిరుమల స్వామి, ఎంపీఓ రతన్ సింగ్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు యాలాటి పావని లు మాట్లాడుతూ మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి సెర్ప్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమలు, వివిధ జీవనోపాధి కార్యక్రమాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. గ్రామస్థాయిలో మహిళా సంఘాల కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడంలో వీఓఏ ల పాత్ర కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల మహిళా సమాఖ్య కార్యదర్శి స్వరూప, కోశాధికారి మంజుల, ఐకెపి సీసీ లు లక్ష్మయ్య,అనంతయ్య,మాణిక్ రెడ్డి,మంజుల స్వప్న,నర్సమ్మ,బాల్ రాజ్, అకౌంటెంట్ లక్ష్మి, ఆపరేటర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.