మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఘన స్వాగతం
- బైక్ ర్యాలీలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత
బూర్గంపహాడ్ ఆగస్టు 25(ప్రజాక్షేత్రం):మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆయన పర్యటన సందర్భంగా భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ర్యాలీలో మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలతతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేగా కాంతారావుకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం కార్యకర్తలు, అభిమానులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా కొనసాగడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రేగా కాంతారావు నాయకత్వానికి మద్దతుగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేగా కాంతారావుకు లభించిన స్వాగతం, బైక్ ర్యాలీతో ప్రాంతంలో రాజకీయ సందడి నెలకొంది.