మృత్యు పాశంగా మారిన సీతారామ కెనాల్ వంతెన
మృత్యు పాశంగా మారిన సీతారామ కెనాల్ వంతెన జింకలగూడెం సమీపంలో అడుగడుగునా గుంతలు.. బయటకొచ్చిన ఇనుప రాడ్లు రాత్రివేళ కనిపించని ప్రమాదపు గుంతలు.. వాహనదారుల ప్రాణాలతో చెలగాటం ప్రమాదం జరిగితేనే అధికారులు స్పందిస్తారా? తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికుల డిమాండ్ బూర్గంపాడు, ఆగస్టు 17(ప్రజాక్షేత్రం):జింకలగూడెం సమీపంలోని సీతారామ కెనాల్ బ్రిడ్జి ప్రయాణికులకు మృత్యు పాశంగా మారుతోంది.వంతెనపై రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడటంతో పాటు రోడ్డు పెచ్చులూడి లోపల ఉన్న ఇనుప రాడ్లు బయటకు రావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిత్యం వందలాది...