మేడ్చల్ జిల్లాలో వివాదం కౌన్సిలర్ సీటులో భర్త ప్రత్యక్షం!
మేడ్చల్ జిల్లాలో వివాదం కౌన్సిలర్ సీటులో భర్త ప్రత్యక్షం! మేడ్చల్ ఆగస్టు 04(ప్రజాక్షేత్రం):మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ 9వ వార్డులో చోటుచేసుకున్న ఒక ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్ రజిత కార్యాలయంలో, ఆమె భర్త రాజేందర్ అధికారిక కౌన్సిలర్ కుర్చీలో కూర్చున్నట్లు చెబుతున్న దృశ్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఎవరు? అధికార బాధ్యతలు నిర్వర్తిస్తున్నది ఎవరు? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కార్యాలయంలో,...