రాజా బహదూర్‌ సేవలు చిరస్మరణీయం

రాజా బహదూర్‌ సేవలు చిరస్మరణీయం కాప్రా, ఆగస్టు 22(ప్రజాక్షేత్రం): తెలంగాణ సమాజానికి, హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రాజా బహదూర్‌ వెంకట రామారెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. రాజా బహదూర్‌ వెంకట రామారెడ్డి జయంతి సందర్భంగా రాధిక ఎక్స్‌రోడ్‌ వద్ద ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ, విద్యాభివృద్ధి, సామాజిక సంక్షేమానికి వెంకట రామారెడ్డి అందించిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి...