prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 9:38 am Digital Edition : PRAJA KSHETRAM

వరి ధాన్యం డబ్బుల కోసం 2 నెలలుగా అన్నదాత హరిగోస

వరి ధాన్యం డబ్బుల కోసం 2 నెలలుగా అన్నదాత హరిగోస

  • కొట్టొచ్చిన ఐకెపి ఎపిఎం, సిసి, నిర్లక్ష్యం,
  • ఈ విషయంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి!
  • KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల మల్కయ్య,
  • వ్య. కా. స జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప

యాలాల జూలై 03(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో KVPS, వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో రైతు సమస్యలపై విలేకరుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప మాట్లాడుతూ.. యాలాల మండలం రాస్నం గ్రామంలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆ గ్రామానికి చెందిన 1) మారి గల్ల కాశమ్మ, 116 వరి ధాన్యం బస్తాలు, 2) మొల్లమనన్ 103 వరి ధాన్యం బస్తాలు, 3) రైకల అజీమ్ 78 వరి ధాన్యం బస్తాలు, 4) ఎన్కేపల్లి మల్లప్ప 78 వరి ధాన్యం బస్తాలు, 5) రైకల జుబేరా బేగం 38 వరి ధాన్యం బస్తాలు, 6) రైకల జుబేదా బేగం 32 వరి ధాన్యం బస్తాలు, మరి కొంత మంది రాస్నం గ్రామానికి చెందిన పేద రైతులు అనేకసార్లు కొనుగోలు కేంద్ర నిర్వాహకులను అడిగిన ప్రాదేయపడిన ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేయడం జరిగింది. రైతులు ఆరు కాలం కష్టపడి పంట పండించి ఎలాంటి మధ్యవర్తుల లేకుండా ఉంటుంది అని నమ్మిన రైతులు ప్రభుత్వానికి వరి ధాన్యం అమ్మితే అధికారులు మాత్రం రైతులను వివక్ష చూపిస్తూ అవహేళన చేసే విధంగా ఐకెపి అధికారులు మాట్లాడుతున్నారు. గత రెండు నెలల నుండి రైతులు వడ్లు కొనుగోలు కేంద్రంలో అమ్మినప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి అని ప్రశ్నించారు? ఈ విషయంలో కొట్టిచ్చిన ఐకెపి ఎపిఎం, సి సి, నిర్లక్ష్యం కనబడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం రైతు వరి ధాన్యం అమ్మిన డబ్బులు రైతు ఖాతాలో జమ కావాలి. కానీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఫోన్లో రైతులతో మాట్లాడి మీ డబ్బులు మీ చేతికి ఇస్తాం అనడం ఏంటని రైతులను వ్య.కా.సం. కెవిపిఎస్, లు నిలదీస్తావున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు రాస్నం గ్రామంలో పూర్తి సమగ్ర విచారణ చేసి రైతుల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇట్టి సమస్య పరిష్కరించన ఎడల జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల నాయకులు కోరవని గణేష్, మారిగోళ్ళ అనంతయ్య, మొల్లమనన్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.