prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 5:32 am Digital Edition : PRAJA KSHETRAM

విజేతగా నిలిచిన పెద్దేముల్ లయన్స్….అభినందించిన మహిపాల్ రెడ్డి

విజేతగా నిలిచిన పెద్దేముల్ లయన్స్….అభినందించిన మహిపాల్ రెడ్డి

పెద్దేముల్, ఆగస్టు 24(ప్రజాక్షేత్రం):తాండూరు హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీల్లో పెద్దేముల్ లయన్స్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. కోట్పల్లి కింగ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అక్షర కాన్సెప్ట్ స్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఈ పోటీలకు శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించారు. విజేతలు, రన్నరప్ జట్లకు శంకర్ యాదవ్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా గౌతమి మోడల్ స్కూల్ కరస్పాండెంట్, కబడ్డీ టీం స్పాన్సర్ పి.మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అనేకమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని అన్నారు. క్రీడల్లో రాణించే విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. పెద్దేముల్ లయన్స్ జట్టు విజేతగా నిలవడం పట్ల క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో ధార్మిక పరిషత్ సభ్యులు విజయ్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, ఓం ప్రకాష్ సోమని, టీం స్పాన్సర్లు అజయ్ ప్రసాద్ (బషీరాబాద్), మనోహర్ (తాండూరు మండలం), డాక్టర్ శరత్ చంద్ర (యాలాల్), రాములు (కోట్పల్లి), కిషన్ రాటి, మార్వాడీ యువమంచ్ నాయకులు రాజ్ కుమార్, బీసీ సంఘం నాయకులు, పీటీలు రాధాకృష్ణ, గోపాల్, అంపైర్లు రాము, రవి, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.