విద్యుత్తు ఘాతకానికి గురైన కార్మికుడు చంద్రప్పకు న్యాయం చేయాలి.
- కార్మికుని వైద్య ఖర్చులకు, కుటుంబ పోషణ కు, ప్రభుత్వమే ఆర్థిక భరోసా కల్పించాలి.
- సిఐటియు జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్.
- జిల్లా నాయకులు యు. బుగ్గప్ప డిమాండ్
యాలాల ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):యాలాల మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికుడిని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, జిల్లా నాయకులు యు. బుగ్గప్ప మాట్లాడుతూ.. విద్యుత్తు పనులు చేస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్తు ఘాతానికి గురైన కార్మికుని, ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే ఆదుకోవాలని కోరారు. కార్మికుడి కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్యం అందించడంతో పాటు ఇప్పటివరకు అయినా వైద్య ఖర్చులను భరించాలి అన్నారు. కార్మికుడికి చట్టబద్ధమైన పరిహారం అందించే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని అన్నారు. విద్యుత్తు పనుల్లో భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందా అనే విషయంపై సమగ్ర విచారణ జరిపి నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే కార్మికుల ప్రాణాలతో చలగాటం ఆడకుండా విద్యుత్ పనుల్లో అవసరమైన చర్యలను కఠినంగా అమలు చేయాలన్నారు. విద్యుత్తు ఘాతానికి గురైన కార్మికుడికి తక్షణమే చేయాలని, తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురైన కార్మికుడిని పరమార్చించిన వారిలో శ్రీను, మల్లప్ప తదితరులు ఉన్నారు.