వేపచెట్టు కోసం 25 ఏళ్లుగా గొడవ ఇద్దరి దారుణహత్య
సూర్యాపేట జిల్లా ఎర్రగడ్డ తండాలో విషాదం గొడ్డళ్లతో దాడులు చేసుకున్న రెండు వర్గాలు అడ్డుకునేందుకు యత్నించిన ఎస్సై నవీన్ కుమార్ కి గాయాలు సూర్యాపేట ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):సూర్యాపేట జిల్లాలో ఓ చిన్న వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డతండాలో ఇంటి పక్కన ఉన్న వేపచెట్టు విషయమై రెండు వర్గాల మధ్య రేగిన చిచ్చు… దారుణమైన రక్తపాతానికి దారితీసింది. మాటామాటా పెరిగి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఇరు వర్గాలు విచక్షణ కోల్పోయి ఏకంగా గొడ్డళ్లతో పరస్పరం దాడులకు తెగబడటం స్థానికంగా తీవ్ర కలకలం...