సర్పంచ్, సెక్రటరీల మధ్య వివాదం…..ఇరువర్గాలపై కేసులు నమోదు
- సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ వర్గాల పరస్పర దాడులు
- పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఒకరి పై ఒకరు పరస్పర ఫిర్యాదులు
- క్రైమ్ నెంబర్ 152/2026 లో 121(1), 132, 351(2) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్
- క్రైమ్ నెంబర్ 153/2026 లో 118(1), 351(2), 352 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ల కిందా కేసు నమోదు
- వివరాలు వెల్లడించిన పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్
పెద్దేముల్,ఆగష్టు 16(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల పరిధిలోని కందెనెల్లి తండా సర్పంచ్ రాథోడ్ ఆనంద్ నాయక్, ఆయన కుమారుడు నితీష్,పంచాయతీ సెక్రటరీల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విధి నిర్వహణ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అనంతరం పరస్పరం దాడులకు పాల్పడినట్లు సమాచారం.
ఎంపీడీఓ కార్యాలయంలో చోటు చేసుకున్న ఘర్షణ
విధి నిర్వహణలో ఉన్న సమయంలో సర్పంచ్ రాథోడ్ ఆనంద్ నాయక్, పంచాయతీ సెక్రటరీలు మల్లేష్, కే.నవిత ల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.మాటామాటా పెరగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం.ఈ ఘటనతో ఎంపీడీఓ కార్యాలయం లోపల కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీస్ స్టేషన్ లో ఇరువర్గాల ఫిర్యాదులు
ఘటన అనంతరం ఇరువర్గాలు అదే రోజు పెద్దేముల్ పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సెక్రటరీ ఫిర్యాదుతో సర్పంచ్, ఆయన కుమారుడు పై కేసు
పంచాయతీ సెక్రటరీ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కందెనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్, ఆయన కుమారుడు నితీష్ కుమార్‌లపై పోలీసులు క్రైమ్ నెంబర్ 152/2026 లో 121(1), 132, 351(2) రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ ల కిందా కేసు నమోదు చేసినట్లు పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.
సర్పంచ్ ఫిర్యాదుతో ఇద్దరు సెక్రటరీలపై కేసు
అదేవిధంగా సర్పంచ్ ఆనంద్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచాయతీ సెక్రటరీలు మల్లేశం, కే.నవితలపై కూడా క్రైమ్ నెంబర్ 153/2026 లో
118(1), 351(2), 352 రెడ్ విత్ 3(5) బీఎన్ఎస్ సెక్షన్ ల కిందా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తెలిపారు
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇరువర్గాల ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.ఘర్షణకు దారితీసిన కారణాలు, ఘటనలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.