సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి సూర్యాపేట ఆగస్టు 26(ప్రజాక్షేత్రం):సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ఈ ప్రమాదంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.! ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని...