prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 7:00 am Digital Edition : PRAJA KSHETRAM

స్వాతంత్ర్య వేడుకల్లో సేవా స్ఫూర్తి.. పాఠశాలకు ఇనుప ఉయ్యాల బహూకరణ

స్వాతంత్ర్య వేడుకల్లో సేవా స్ఫూర్తి.. పాఠశాలకు ఇనుప ఉయ్యాల బహూకరణ

  • విద్యార్థుల ఆనందమే లక్ష్యంగా సోడె వీరభద్రం–లీలా దంపతుల ఔదార్యం

బూర్గంపాడు, ఆగస్టు 15(ప్రజాక్షేత్రం):స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి, త్యాగస్ఫూర్తిని చాటుతూ సాగుతుండగా.. బుడ్డగూడెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో సోడె వీరభద్రం–లీలా దంపతులు అందించిన సేవా కానుక విద్యార్థుల ముఖాల్లో ఆనందం నింపింది.తన తాత,నానమ్మ సోడె బక్కయ్య–బాలమ్మ జ్ఞాపకార్థం వారి మనుమడు సోడె వీరభద్రం దంపతులు పాఠశాల విద్యార్థుల ఆటవిడుపు కోసం ఇనుప ఉయ్యాలను బహూకరించారు.

జ్ఞాపకాలను సేవగా మలిచిన వీరభద్రం

తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకాలను కేవలం గుర్తుచేసుకోవడానికే పరిమితం కాకుండా.. వాటిని విద్యార్థుల సంతోషంతో ముడిపెట్టడం ద్వారా సోడె వీరభద్రం తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో ఉయ్యాలను అందించడం పలువురి ప్రశంసలు అందుకుంది.

పిల్లల నవ్వుల్లోనే నిజమైన ఆనందం

చదువుతో పాటు ఆటలు కూడా విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో భాగమని భావించిన వీరభద్రం–లీలా దంపతులు ముందుకు వచ్చి పాఠశాలకు ఉయ్యాలను అందించారు.స్వాతంత్ర్య దినోత్సవం వంటి ప్రత్యేక రోజున ఈ సేవా కార్యక్రమం చేపట్టడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.విద్యార్థుల సౌకర్యాల కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని పాఠశాల హెచ్‌ఎం ఈశ్వర్‌ అన్నారు.

దాతృత్వానికి ఆదర్శంగా..

సమాజం నుంచి పొందినదాన్ని సమాజానికే తిరిగి అందించాలనే ఆలోచనతో సోడె వీరభద్రం చేస్తున్న సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అవసరమని, వీరభద్రం వంటి దాతలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధు, నాగమణి, వార్డు సభ్యులు రవి, ఆదిలక్ష్మి, పుల్లయ్య, కొడెం వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.