ఎస్ఐ చిత్రపటాన్ని గీసి కానుకగా అందించిన చిన్నారి కావేరి

ఎస్ఐ చిత్రపటాన్ని గీసి కానుకగా అందించిన చిన్నారి కావేరి రాఖీ పండుగ సందర్భంగా టౌన్ ఎస్ఐ హరిప్రసాద్‌కు ఆత్మీయ బహుమతి వనపర్తి, ఆగస్టు 28(ప్రజాక్షేత్రం):రాఖీ పండుగ సందర్భంగా వనపర్తి టౌన్‌ ఎస్ఐ బి. హరిప్రసాద్‌కు ఓ చిన్నారి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. తనలోని చిత్రలేఖన ప్రతిభను చాటుతూ ఎస్ఐ హరిప్రసాద్‌ చిత్రపటాన్ని స్వయంగా గీసి, దానిని ఫ్రేమ్‌ చేయించి ఆయనకు ఆత్మీయంగా అందజేసింది. చిన్నారి చూపిన అభిమానం, ఆప్యాయత పోలీసు అధికారిని సంతోషానికి గురిచేసింది. స్థానిక జిల్లా కేంద్రంలోని ప్రేమ్ టైలర్స్ యజమాని...