అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ గడువు పొడిగింపు.
చేవెళ్ల సెప్టెంబర్ 10(ప్రజాక్షేత్రం):డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలు – 2026-27 చేవెళ్ల మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం బిఎ, బికాం, బిఎస్సి కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మరియు సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ రెండవ మరియు మూడవ సంవత్సరం విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును చెల్లించవచ్చని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తు గడువు చివరి తేది సెప్టెంబర్ 30 ఈ విషయాన్ని కళాశాల కో-ఆర్డినేటర్ కె. సూర్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం 9908640914 ఈ నంబర్ సంప్రదించాలని కోరారు.