prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 5:18 pm Digital Edition : PRAJA KSHETRAM

అసమానతలను లేని సమాజాన్ని నిర్మిద్దాం.

అసమానతలను లేని సమాజాన్ని నిర్మిద్దాం.
                                 

  • అబ్రహంమాదిగ ఎమ్మెస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు

జహీరాబాద్ సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఆదివారం జహీరాబాద్ నియోజకవర్గం లోని మండలాల ఎమ్మార్పీఎస్ నూతన మండల కమిటీ ఎన్నిక సమావేశం ఎన్ కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమాజంలో ఎలాంటి వివక్షత లేకుండా అన్ని సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి వ్యక్తులను ఉద్యమ శక్తులుగా మలచాల్సిన అవసరం ఉందని ఎమ్మెస్పీ మాజీ జిల్లా అధ్యక్షులు అబ్రహం మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్, అనుబంధ విభాగాల పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు మొగుడంపల్లి అధ్యక్షులుగా నిర్మల్ మాదిగ, జహీరాబాద్ మండలం అధ్యక్షులుగా విజయ్ అమల్ మాదిగ, ఝరాసంగం మండల అధ్యక్షులుగా మైకల్ రాజు మాదిగ, కోహిర్ మండల అధ్యక్షులుగా దయానంద్ మాదిగ లను నియమించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సారథ్యంలో అన్ని విభాగాల సంస్థాగత నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జైరాజ్ మాదిగ మాజీ ఉపాధ్యక్షులు,పద్మారావు మాదిగ మాజీ సహాయ కార్యదర్శి సుదర్శన్, మధు, బన్నీ, కిరణ్ చింటూ, ఎరపుల తరుణ్, శరణప్ప, బి.సుమన్, సుకుమార్, దిలీప్, జీవన్, కిషోర్, భరత్, ప్రకాష్, మనోజ్, నాని, నర్సిoములు, రవికుమార్, సందీప్, చంటి, రఘు,రాజు, నరేష్, అఖిల్, ప్రసన్న, వినయ్, పాల్, సునీల్, నోహ, సంగన్న, లడ్డు, సందీప్, శాంత్ లు పాల్గొన్నారు.