ఇందిరాపార్క్ మహా ధర్నాలో శంకర్ పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు.
- కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్.
శంకర్‌పల్లి సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన భారీ మహా ధర్నాలో శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకటరెడ్డి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మడపకు చంద్రమౌళి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు శంకర్‌పల్లి మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన మహా ధర్నాకు హాజరై పార్టీ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో ఇందిరాపార్క్ పరిసరాలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలను నిర్వర్తించాల్సిన కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకుండా పదవిలో కొనసాగడం సరికాదని పేర్కొంటూ, కేసీఆర్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహా ధర్నాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లారం వెంకటరెడ్డితో శంకర్‌పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో సంకేపల్లి గోపాల్, డి.సి.సి.గోపాల్ రెడ్డి, శంకర్ పల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రమౌళి, గోపులారం సర్పంచ్ రవీందర్ రెడ్డి, గోపులారం మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్, రావులపల్లి సర్పంచ్ కృష్ణ మూర్తి, ఉపసర్పంచ్, వెంకట్ రెడ్డి, అలకంగూడ మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, టంగుటూరు సర్పంచ్ కృష్ణ రెడ్డి, టంగుటూరు ఉపసర్పంచ్ గోపులారం మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి, టంగుటూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యకులు బొల్లారం ప్రశాంత్ రెడ్డి, మొకిల విలేజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండ్ర సత్యం, పాల్గొనారు.
