prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 4:19 am Digital Edition : PRAJA KSHETRAM

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన మాందాపురం పాలకవర్గం

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన మాందాపురం పాలకవర్గం

వలిగొండ సెప్టెంబర్ 20(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మాందాపురం గ్రామపంచాయతీ పాలకవర్గం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ సర్పంచ్ దంతూరి యాదమ్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి గ్రామంలోని పలు సమస్యలను వివరించారు. ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ స్తంభాలు, మట్టి రోడ్డు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరగా, తప్పకుండా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.