ఏసీబీ వలలో తహసీల్దార్ సృజన్‌కుమార్
వారసత్వ భూమి మార్పిడికి రూ. 15 వేలు డిమాండ్ బేరసారాల అనంతరం రూ. 14 వేలకు ఒప్పందం లంచం తీసుకుంటుండగా గోవిందరావుపేట అధికారి పట్టివేత ములుగు సెప్టెంబర్ 18(ప్రజాక్షేత్రం):పూర్వీకుల వ్యవసాయ భూమి వారసత్వ హక్కు నమోదు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు రూ. 14 వేల లంచం తీసుకుంటూ గోవిందరావుపేట తహసీల్దార్ నెల్లుట్ల సృజన్‌కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ వరంగల్ రేంజ్ అధికారులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో ట్రాప్ నిర్వహించి నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ప్రెస్‌నోట్ ప్రకారం.. ఫిర్యాదుదారుడి భార్య లింగాల శ్రీలత...