prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 4:24 am Digital Edition : PRAJA KSHETRAM

కరెంట్ షాక్ తో రైతు మృతి

కరెంట్ షాక్ తో రైతు మృతి

వలిగొండ సెప్టెంబర్ 20(ప్రజాక్షేత్రం):యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామానికి చెందిన ఏనుగుల ఐలయ్య తండ్రి సత్తయ్య తన వ్యవసాయ బావి వద్ద మోటార్ కు కరెంటు రాకపోవడంతో, ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్ళి ఏబి స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు చేతి వేళ్ళకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినాడు. ఈ విషయంపై మృతుని యొక్క కుమారుడు ఎనుగుల శివ చేసిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా వలిగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపినారు.