కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట

కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పోరుబాట ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శ. బూర్గంపాడు, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన పోరుబాట కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షులు బోరెం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షులు బోరెం శ్రీనివాసరావు...