prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 1:54 pm Digital Edition : PRAJA KSHETRAM

కుత్బుల్లాపూర్‌లో మైత్రి దంత వైద్యశాల రెండో శాఖ ప్రారంభం

కుత్బుల్లాపూర్‌లో మైత్రి దంత వైద్యశాల రెండో శాఖ ప్రారంభం

  • అత్యాధునిక దంత వైద్యం ఇక మరింత చేరువ..డాక్టర్ మైత్రి రెడ్డి
  • శాఖను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద

కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):దంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. సమస్యలను తొలిదశలోనే గుర్తించి నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మైత్రి దంత వైద్యశాల తన రెండో శాఖను కుత్బుల్లాపూర్‌లో ప్రారంభించింది. ఈ నూతన శాఖను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దంత వైద్య నిపుణురాలు డాక్టర్ మైత్రి రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఆధునిక దంత వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ శాఖను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి వర్గానికి నాణ్యమైన దంత చికిత్స అందించడంతో పాటు, దంత సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు డాక్టర్ మైత్రి రెడ్డి పేర్కొన్నారు. చికిత్సకు ముందు అవగాహన.. సమస్యకు ముందే పరిష్కారం అనే విధానంతో సేవలు అందించనున్నట్లు తెలిపారు. కొత్త శాఖలో దంత పరీక్షలు, పళ్ల శుభ్రత, రూట్ కెనాల్ చికిత్స, దంత ఇంప్లాంట్లు, పళ్ల అమరిక, పిల్లల దంత వైద్యం తదితర సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్యులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, స్థానికులు, వైద్యశాల సిబ్బంది పాల్గొని డాక్టర్ మైత్రి రెడ్డితో పాటు వైద్యశాల నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.