prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 12:06 pm Digital Edition : PRAJA KSHETRAM

కేఎస్ రత్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత బండమీది వెంకటేష్

శంకర్ పల్లి సెప్టెంబర్ 02(ప్రజాక్షేత్రం):చేవెళ్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు బండమీది వెంకటేష్ హాజరై కేఎస్ రత్నంకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. కేఎస్ రత్నం ప్రజా జీవితంలో మరింత చురుకుగా కొనసాగుతూ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని బండమీది వెంకటేష్ కోరుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కేఎస్ రత్నంకు శుభాకాంక్షలు తెలిపారు.