గంజాయి నియంత్రణకు ఎస్సై కృష్ణారెడ్డి ప్రత్యేక చర్యలు
గంజాయి నియంత్రణకు ఎస్సై కృష్ణారెడ్డి ప్రత్యేక చర్యలు నిర్మల్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 06(ప్రజాక్షేత్రం):కుబీర్ గజాయి ఇతర మత్తుపదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. గంజాయి సేవిస్తున్నారా లేదా అనే విషయాన్ని క్షణాల్లో గుర్తించేలా పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేక టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. గంజాయి వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులను ఈ కిట్ల ద్వారా పరీక్షించి అవసరమైన సందర్భాల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల వినియోగం ముఖ్యంగా యువత భవిష్యత్తుపై...