గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం.
గోపన్‌పల్లిలో పక్కకు ఒరిగిన భవనం.. పరుగుతీసిన స్థానికులు స్థానికుల్లో తీవ్ర భయాందోళన కూల్చివేత పనులకు సిద్ధమవుతున్న జీహెచ్‌ఎంసీ అధికారులు ముందుజాగ్రత్తగా సమీప ఇళ్లలోని ప్రజల తరలింపు హైదరాబాద్ సెప్టెంబర్ 18(ప్రజాక్షేత్రం):హైదరాబాద్, గచ్చిబౌలి పరిధిలోని గోపన్‌పల్లిలో ఓ నాలుగంతస్తుల భవనం ప్రమాదకరంగా పక్కకు ఒరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉండటంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గోపన్‌పల్లిలో కేవలం 50 గజాల స్థలంలోనే ఈ నాలుగంతస్తుల భవనాన్ని నిర్మించినట్లు...