గర్భనిరోధక మాత్రలపై ఇక వార్నింగ్ తప్పనిసరి..!!

ఎమర్జెన్సీ పిల్’పై కేంద్రం కీలక ప్రతిపాదన. రెగ్యులర్‌గా వాడొద్దంటూ స్పష్టమైన హెచ్చరిక..!! న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18(ప్రజాక్షేత్రం):గర్భనిరోధక మాత్రల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రెగ్నెన్సీ కంట్రోల్ పిల్ ‘లెవోనార్జెస్ట్రెల్’ 0.75 ఎంజీ/1.5 ఎంజీ ప్యాక్‌పై తప్పనిసరిగా వార్నింగ్ లేబుల్ ముద్రించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కేంద్రం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ మాత్రను వినియోగించాలని, రెగ్యులర్‌గా ఉపయోగించకూడదని ప్యాక్‌పై స్పష్టంగా ముద్రించాలని ప్రతిపాదనలో పేర్కొంది. అలాగే ఈ మాత్ర...