డిప్యూటీ ఎమ్మార్వో కార్తీక్‌ను సన్మానించిన బండమేది వెంకటేష్

డిప్యూటీ ఎమ్మార్వో కార్తీక్‌ను సన్మానించిన బండమేది వెంకటేష్ శంకర్ పల్లి సెప్టెంబర్ 15(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండల డిప్యూటీ ఎమ్మార్వోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్తీక్ను బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు బండమీది వెంకటేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండమీది వెంకటేష్ డిప్యూటీ ఎమ్మార్వో కార్తీక్‌కు భగవద్గీతను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా సేవలందించాలని ఆకాంక్షించారు. శంకర్‌పల్లి మండలంలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు....