తహసీల్దార్ కోసం ప్రజల పడిగాపులు
మధ్యాహ్నం 12.20 అయినా అందుబాటులో లేని అధికారి.. పనుల కోసం వచ్చిన వారికి నిరీక్షణ శంకర్‌పల్లి, సెప్టెంబర్ 11(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అధికారుల అందుబాటు ప్రశ్నార్థకంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.20 గంటల సమయం దాటినా తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. భూ సమస్యలు, ధ్రువపత్రాలు, రెవెన్యూ సంబంధిత పనులు తదితర అంశాలపై కార్యాలయానికి వచ్చిన ప్రజలు...