తృటిలో తప్పిన ప్రాణాపాయం
తృటిలో తప్పిన ప్రాణాపాయం ఫత్తేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ఘటన శంకర్‌పల్లి, సెప్టెంబరు 24(ప్రజాక్షేత్రం):వినాయక నిమజ్జనం చేస్తుండగా ఓ యువకుడు విగ్రహంతోపాటు వాగులో పడిపోయిన ఘటన శంకర్‌పల్లి మున్సిపల్ ఫత్తేపూర్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. నిమజ్జనం సందర్భంగా అదుపుతప్పిన యువకుడు విగ్రహంతో సహా నీటిలో పడిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. యువకుడు నీటిలో కాకుండా కింద ఉన్న కఠిన ప్రదేశంలో పడితే పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనాల నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అధికారులు...