prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 11:22 am Digital Edition : PRAJA KSHETRAM

దాడిలో తీవ్రంగా  గాయపడిన మాదిగలను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నాయకులు.

యాలాల్ సెప్టెంబర్ 19(ప్రజాక్షేత్రం):యాలాల్ మండలం గంగసారం గ్రామ, మాదిగల ను కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన బీసీ ముదిరాజ్ ల పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి ఎమ్మార్పీఎస్ శుక్రవారం సాయంత్రం 7:00గంటలకు యాలాల్ మండలం గంగాసరం గ్రామంలో వినాయక నిమజ్జనం సమయంలో అదే గ్రామానికి చెందిన బీసీ ముదిరాజ్ కులానికి చెందిన వారు వినాయక నిమజ్జనం వద్దకు మాదిగలు రావద్దనీ మీరు కులం తక్కువ కొడుకులని, హరిజన ఆనంద్, హరిజన శివ కుమార్, హరిజన వీరేశం, హరిజన భరత్, హరిజన లక్ష్మీ ఎస్సీ మాదిగలను
కులం పేరుతో దూషించి గొడవకు దిగి మాదిగ యువకులపై మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. గాయపడిన మాదిగలు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందుతూన్నరూ ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా ఉప అధ్యక్షుడు జింగుర్తి నర్సింలు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుట్టకింది రవి మాదిగ, చిట్టి గిద్ద కిష్టయ్య మాదిగ, యాలాల్ మండల ఇంచార్జి సూర్య ప్రకాష్ మాదిగ, జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు శనివారం ఉదయం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని గాయపడిన మాదిగ యువకులతో మాట్లాడడం, వాస్తవాలను తెలుసుకోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా యాలాల్ మండలం గంగసారం గ్రామంలో మాదిగలపై బీసీ ముదిరాజ్ లు మాదిగలను తక్కువ చూపుతో చూస్తూ కుల వివక్షను చూపుతారని అనేక సందర్భాల్లో మాదిగలపై దాడులు కూడా చేశారని బాధితులు తెలిపారు. ఇది మొదటి సారి కాదని దాదాపు నాలుగు సార్లు అవుతుంది. అని తెలిపారు మా పై దాడి చేశారు వారిపై కచ్చితంగా శిక్ష పడాలని దానికోసం ఎంత దూరమైన వస్తారని తెలిపారు. అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లికార్జున్ మాదిగ స్థానిక ఎస్ఐ కి మరియు డిఎస్పీతో మాట్లాడడం బిసి ముదిరాజ్ లపై వెంటనే కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం తప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులుయాలాల్ మండల ఇంచార్జి సూర్య ప్రకాష్ మాదిగ, జిల్లా నాయకులు మహేందర్ మాదిగ, సుభాష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ యాలాల్ మండల అధ్యక్షుడిగా మెట్లి నరేష్ మాదిగ, సుధాకర్ మాదిగ, ఎం ఎస్ ఎఫ్ జిల్లా కో ఇంచార్జి శివాజీ మాదిగ, తాండూర్ మండల నాయకులు వెంకట్ మాదిగ, భరత్ మాదిగ, శ్రీశైలం మాదిగ, శివకుమార్ మాదిగ, గంగాసారం గ్రామస్థులు నర్సింలు, శివకుమార్, శ్రీనివాస్ శ్రీనివాస్, జనార్దన్, వీరప్ప, శ్రీను, ఆనంద్, పెద్ద నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.