prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 6:06 pm Digital Edition : PRAJA KSHETRAM

దాడులు ఆపాలి.. రైస్ మిల్లర్లకు సహకరించాలి..!

దాడులు ఆపాలి.. రైస్ మిల్లర్లకు సహకరించాలి..!

  • డిసెంబర్ 31లోగా పెండింగ్ సీఎంఆర్ ఇచ్చేందుకు రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారు.
  • విజిలెన్స్ దాడులు కేసుల వల్ల రైస్ మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
  • రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ పటేల్.

కోటగిరి, సెప్టెంబర్ 10(ప్రజాక్షేతం):ప్రభుత్వం రైస్ మిల్లర్లపై చేపడుతున్న విజిలెన్స్ దాడులు ఆపి రైస్ మిల్లర్ల సమస్యలు తెలుసుకుని రైస్ మిల్లర్లకు సహకరించాలని ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్ పటేల్ కోరారు. కోటగిరి మండల కేంద్రంలోని రైస్ మిల్లర్ల అసోసియేషన్ కార్యాలయంలో గురువారము రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఆద్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు… రైస్ మిల్లర్ల వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని రైస్ మిల్లర్లలో కొందరు ప్రభుత్వానికి ఇచ్చే సీఎంఆర్ బకాయి ఉన్న మాట వాస్తవమని 2025 ‌‌,26 ఖరీఫ్ సీజన్ కు చెందిన సీఎంఆర్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు రైస్ మిల్లర్లకు డిసెంబర్ 31 వరకు సమయం ఉందని పెండింగ్ సీఎంఆర్ డిసెంబర్ 31లోగా ఇచ్చేందుకు రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇంతలో ప్రభుత్వం విజిలెన్స్ దాడులు నిర్వహించి కేసులు చేసి రైస్ మిల్లులు సీజ్ చేయటం వల్ల రైస్ మిల్లర్లకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైస్ మిల్లర్ల కుటుంబాలు రోడ్డు న పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ల సమస్యలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రైస్ మిల్లర్లకు సహకరించాలని కోరారు.రైస్ మిల్లర్లందరం శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నామని ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులతో జిల్లా అధ్యక్షులను పిలిచి మాట్లాడి రైస్ మిల్లర్ల సమస్యలు తెలుసుకుని తమపై సానుభూతితో అండగా ఉండాలని కోరారు. మొండి బకాయిలు ఉన్నవారిపై కఠినంగా వ్యవహరించినా పర్లేదు కానీ కొద్దిగా బకాయిలు ఉన్నవారికి ప్రభుత్వం కొంత సమయం ఇవ్వాలని అడిగారు. సీఎంఆర్ బియ్యం లారీలు పంపితే గోదాముల్లో ఖాళీ లేక నెలల తరబడి ఖాళీ అవ్వటంలేదని వెంటనే లోడ్‌లు ఖాళీ అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. బియ్యం స్టోరేజ్ కు స్థలం లేక రైస్ మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైస్ మిల్లర్లు పంపే సీఎంఆర్ నిల్వ చేసేందుకు గోదాములు కేటాయించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటాలు వడ్లకు 67 కిలోల బియ్యం వచ్చే పరిస్థితులు లేవని అవి భర్తీ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కరెంటు, హమాలీ చార్జీలు పెరగడంతో రైస్ మిల్లర్లపై పెను భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఆర్ పెండింగ్ క్లియర్ చేసేందుకు అవకాశం ఇచ్చినా తీరు మార్చుకోని రైస్ మిల్లర్లపై అధికారులు చర్యలు తీసుకున్నా తమకు సమ్మతమేనని కానీ ఎవరో ఒకరు చేసే తప్పులకు అందరూ రైస్ మిల్లర్లను ఆపాదించవద్దని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శంకర్ పటేల్,జనరల్ సెక్రెటరీ నిశాంత్ సేఠ్,వైస్ ప్రెసిడెంట్ సిరాజ్,క్యాషియర్ అన్సార్,జాయింట్ సెక్రెటరీ నిసార్ హైమద్,సభ్యులు జుబేర్ హైమద్,గణేష్ సేఠ్, అన్వర్,అక్రమ్,జమీర్,శ్రీనివాస్ రెడ్డి,శ్రీనివాసరావు,సోహెల్,అతీక్,లయీఖ్,ఏక్బాల్,,సాయి రెడ్డి,అల్లం సునీల్,అక్రమ్ ఖాన్,కరీం అతిక్,లయక్,కూచి సిద్దు,కృష్ణారెడ్డి,అశ్వక్ హైమద్,రౌఫ్,సత్తార్,మమ్మద్, తదితరులు పాల్గొన్నారు.