
పేదలకు గునిశాలు ఫౌండేషన్ ఆహార పంపిణీ
కాప్రా, సెప్టెంబర్ 10(ప్రజా క్షేత్రం): గునిశాలు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం కాప్రా తహసీల్దార్ కార్యాలయంలో 200 మంది నిరుపేదలకు భోజనం పంపిణీ చేశారు. ఫౌండేషన్ చైర్మన్ బి. సంతోషి తన తండ్రి గునిశాలు 26వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదలు, వృద్ధులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఏటా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, న్యాయవాది సుంకరి నరేష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.