prajakshetram.com
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:37 pm Digital Edition : PRAJA KSHETRAM

ప్రజాక్షేత్రం’ వార్తకు స్పందన

  • రోడ్డుకు మరమ్మతులు

చేవెళ్ల, సెప్టెంబర్ 16(ప్రజాక్షేత్రం):సోమవారం ‘ప్రజాక్షేత్రం’ దినపత్రికలో “చిత్తడిగా రోడ్డు…. నరకప్రాయంగా ప్రయాణాలు” అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ప్రజాప్రతినిధులు స్పందించారు. వాహనదారుల ఇబ్బందులపై పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా కౌన్సిలర్, మాజీ సర్పంచ్ వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. సమస్యను వెలుగులోకి తెచ్చిన పత్రికకు, వెంటనే పరిష్కరించిన నాయకులకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.