ప్రజా సంక్షేమం.. సామాజిక న్యాయమే లక్ష్యం
బాధ్యతాయుత పాలనతో అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి విశ్వకర్మ జయంతి వేడుకల్లోనూ పాల్గొన్న ముఖ్యఅతిథి వనపర్తి, సెప్టెంబరు 17(ప్రజాక్షేత్రం):ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి అజెండాతో ప్రజలకు బాధ్యతాయుత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనమండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వనపర్తి ఐడీఓసీ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు శాఖ నిర్వహించిన గౌరవ వందనాన్ని...