బుడ్డగూడెంలో ఆగని ఇసుక రవాణా..!
ఎవరి అండదండలతో కొనసాగుతోంది? చర్యలకు అధికారులు ఎందుకు వెనుకడుగు? బూర్గంపహాడ్, సెప్టెంబర్ 10(ప్రజాక్షేత్రం):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సోంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బుడ్డగూడెంలో ఇసుక రవాణా వ్యవహారం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రోజురోజుకూ ఇసుక ట్రాక్టర్ల రాకపోకలు పెరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తారు రోడ్డు కాస్తా మట్టి రోడ్డుగా మారింది! బుడ్డగూడెం నుంచి సోంపల్లి–మొరంపల్లి బంజర వైపు వెళ్లే రహదారిపై ఇసుక...